Skip to content

Difficulties in writing in Telugu

March 11, 2014

There are times when I engage (needless) in debates. One recent example was engaging in a debate on Wendy Doniger controversy. The article is published in eemaaTa (online telugu magazine). I was commenting heavily in English and some commentators complained. I thought about it seriously and wrote this comment which was not approved for reasons only the editorial board knows. Thankfully, the editor did pass on the message to the unhappy commentators about my commenting in English in a Telugu magazine. If you are one of those rarest of rare species who can read Telugu (whether you are Telugu by birth or not). Then you can go and read the link below. I highly recommend not to waste your time by reading the essay but (some) comments are insightful specially by one Mr Raghottama Rao garu. The link is below:

http://eemaata.com/em/issues/201403/3567.html?allinonepage=1

The following post in Telugu is my heart-felt feelings about my inadequacy in expressing in my mother language Telugu compared to English. I wanted to post it here in my blog. Somehow I liked what I wrote. I never wrote such a long Telugu post in long time.

**********************************************

శ్యామల రావు గారికి, త:త: గారికి, మరియు ఇక్కడ ఉన్నా ఈమాట దిగ్గజాలందరికీ,

ఇక నాలాటి వాళ్ళకి తెలుగు లో వ్రాయటం కష్టమెందుకవుతుందో నా అభిప్రాయాన్ని తెలుపుకుంటాను.

1. నేను తెలుగు మీడియం స్కూల్ లో చదవలేదు. పైగా ఈ ముక్క రాస్తుంటే నా కళ్ళ నీళ్ళు కూడా వస్తున్నాయి – ఆ జ్ణాపకాలు ఒక్కసారిగా తల్చుకుంటుంటే. స్కూల్ లో తెలుగు లో మాట్లాడుకుంటే మాకు శిక్ష ఉండేది. ఒక్కొక్క సారి తిట్లు తినడం, లేదా “fine” కట్టడం. నా చిన్నప్పుడు నా మీదే కాక, నా స్నేహితుల మీద కూడా మా ఉపాధ్యాయులు “Talk in English” అన్న చీవాట్లు ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఒకటి గుర్తుంచుకోవాలి: ఇవనీ “లిబరల్” లక్షాణాలని నాకు అప్పుడు తెలీలేదు.

ఈ పరిస్థిథి ఎందుకు నెలకొంది అంటారు? తెలుగు లో ఎందుకు వ్రాయలేకపోతున్నారు అన్న మీ ప్రశ్నకు జవాబు, అలా ఆ యొక్క ఉపాధ్యాయుల అరుపులకు బెదిరిపోయిన పసిపిల్లల కళ్ళల్లో ఉందండీ.

2. తెలుగు మీడియం లో పదో తరగతి దాకా చదువుకుని, ఆ తరువాత ఆంగ్ల మీడియానికి మారి ఒక్కసారిగా ఆ ఆకస్మిక మార్పుకి తట్టుకోలేక, అంత వరకూ బాగా చదువుకున్న వాళ్ళే, ఇంక ఆ పోటీ కి తట్టుకోలేక వెనకబడి, కూలబడి, ఇంక పోరాడలేనన్న ఎంతో మంది ఆత్మ నూన్యతా భావం లో ఉందండీ సమాధానం.

అలానే ఆ పోటేల్లో పరీక్షలు పోయి, కొందరు (మా చుట్టాల లో కూడా)ఆత్మ హత్య చేసుకునే ముందు పొందిన మానసిక వ్యధ లో దొరుకుతుంది మీకు సమాధానం.

నేను చెప్తున్నది మీకు మరీ “extreme” అనుకుంటున్నారేమో…ఇవన్నీ అక్షర సత్యాలు. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.

3. ఆ తరువాత కొద్దో గొప్పో నిలదొక్కుకున్న వారికి సరిగ్గా ఆంగ్లం రాదని చులకన గా  చూసిన (ఇందులో నేను కూడా ఒకణ్ణి) వాళ్ళ అహంకారం లో, ఆ చులకన గా చూడబడ్డ వాళ్ళ బాధ పడ్డ వాళ్ళ కనిపించని అశ్రువుల్లో కనబడుతుంది మీకు సమాధానం.

4. ఈ దుస్థ్తితిని తెచ్చుకున్న మనకు, మన సంస్కృతికి సంస్కరణ ఉందంటారా?

5. ఆ పైన ఇంజినీరింగ్ అనో, CAT  అనో, GRE అనో, మరోటనో మొత్తం ఆంగ్లం లోనే అభ్యాసం, అవసరం. ఇంక బుర్ర లో తెలుగు ఏమిటి నలుగుతుంది? ఒకప్పుడు (ఇప్పుడూ నూ) అటు ఆంగ్లం లో సరిగ్గా భావం వ్యక్తం చెయ్యలేక,  ఇటు తెలుగు లో వ్యక్తం చెయ్యలేక, బాధ పడిన సందర్భాలూ ఉన్నాయి.

6. ఇవన్నీ అటుంచితే, ఒక సారి తెలుగు మీద బాగా ఎందుకో అభిమానం పుట్టి, కొన్ని ఉద్వేగాలని, భావాలని  వ్యక్తపరచటానికి  తెలుగు భాష ని ఆశ్రయించినపుడు, ఏదీ…పదాలు రావే! అప్పుడనిపించింది భావలని మాతృ భాష లో వ్యక్తీకరించాలని ప్రయత్నిస్తే, భాష రావకపోవడం – “unreciprocated love” లా అనిపించింది.  ఏమిటో శఠించిన ప్రేయసి లా ఎప్పుడూ తెలుగు నాకు దగ్గర అవ్వనే లేదు.

7. ప్రస్తుత విషయం: తెల్లార లేస్తే నిద్రొయే వరకూ, అంతా ఆంగ్లం లోనే నాకు. ఎప్పుడో వారానికోసారి మా అమ్మ నాన్న ల తో మాట్లాడితే తప్ప. ఇక్కడ (Belgium) నిత్యం తెలుగు లో కాస్త సంభాషణ సంభవించడం కష్టం కూడా…పైగా ఇంటికొస్తే కూడా ఒంటరిని. కాబట్టీ తెలుగు మాట్లాడే అవకాశాలు నాకు తక్కువ. ధార వచ్చే లా మాట్లాడడమనేది అరుదే మరి. పోనీ ఈమాట చదవొచ్చు గా అని మీరనొచ్చు. ఈమాటే కాదు, ఎక్కడా కూడా నాకంటూ ఆశక్తి కలిగించే విషయాలు తెలుగు వెబ్ ప్రపంచం లో పెద్దగా లేవు (ఏవో ఇలా mediocre వి తప్పితే). ఎప్పుడైనా పుస్తకాలు చదువుతాను, కానీ ఎక్కువ గా నేను చదివేవన్నీ ఆంగ్లం లోనే.

8. ఇప్పుడు మరి మీరడగ్గానే తెలుగు లో వ్రాయాలయ్యా అంటే ఆ ధార ఎలా  వస్తుంది? ఆలోచన ఆంగ్లం లో చేస్తున్నపుడు, ధార తెలుగు లో రావడం కష్టం. ఒక వేళ ఇంకా ప్రయత్నించి పొనీలే ఆంగ్లాన్ని తెలుగు లోకి తర్జూమా చేసుకుంటూ రాసుకుందాం అని సద్దిపెట్టుకుంటే, ఇదిగో ఈ చర్చనీయాంశమైన mediocre వ్యాసం లా తయారవుతుంది.

9. ఈ పై ముక్కలన్నీ (ఇందాకటి వ్యాఖ్యానాలతో సహా) వ్రాయటానికి నాకు మొత్తం ఒక రోజు పట్టింది. అంటే తెలుగు లో ఆలొచించటానికి చాలా ప్రయత్నించ వలసి వచ్చింది. ఆ పైన ఇక్కడ టైప్ చెయ్యటం.

10. అందుకే నాకు ఆంగ్లం లో వ్యాఖ్యానం చెయ్యటం, విమర్శించటం సులువయ్యింది. పైగా నేను ఇందాకా చెప్పినట్టు, ఏదో ఫేసుబుక్కు లో రఘోత్తమ రావు రాగు వెండీ పాందిత్యాన్ని వ్యాఖ్యానిస్తూ ఉంటే, నాకు జియోపాలిటిక్స్ ఆశక్తి కాబట్టీ చూసి, పైగా ఈ వ్యాసకర్త ఏదో తనకి తానే “detailed analysis” అని చెప్పుకుంటే కుతూహలం తో…పక్షపాత వైఖరి, అబధ్ధాల ముగింపు చూడలేక ఇంక చర్చ లోకి దిగాను అంతే…

11. అందుకే గబుక్కుమని తెలుగు లో ధార గా మీ అందరి లా వ్రాసెయ్యాలంటే నా వల్ల కాదు.

“…అతి సుస్యందనమందున దూరం గా వినువీధుల్లో విహరించే అందని అందానివి గా  భావించిన రోజుల్లో…

…నీ రూపం కనరానందున, నా గుహ లో కుటి లో, చీకటి లో నే స్రుక్కిన రోజులు లేవా…

…నే విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెదుకాడకబోతే…

..అవి…”

శ్రీశ్రీ కి పుంఖానుపుంఖం గా వచ్చుండొచ్చు…కానీ నా గొంతు మాత్రం మూగబోతుంది, కన్ను చెమ్మబోతుంది, కలం ఆగిపోతుంది…

కాబట్టీ నా విజ్నప్తి ఏమిటంటే: ఆంగ్లం లో వ్యాఖ్యానించే వాళ్ళని వాళ్ళ వ్యాఖ్యానలలో మీకు సంకోచాలుంటే అడగండి, నచ్చనిది ఉంటే దుయ్యబట్టండి, కర్కస విమర్శ చెయ్యండి, వ్యాఖ్యానలనీ, విమర్శలనీ చీల్చి చెండాడండీ, కానీ తెలుగు లోనే వ్రాయి, ఆంగ్లం లో కాదు, అని మటుకు ఇంతలా అసంతృప్తి చెందకండి . ఇందాకా అన్నట్టు ఆంగ్లం లో ఐనా తెలుగు లో ఐనా విషయం ఉందా లేదా అన్నది ముఖ్యం.

ఈ వ్యాఖ్యానం ఇప్పటికి సరి. ఐతే ఈ సందర్భం వ్యాసానికి కూడా సంబంధించిందని అన్నాను. అది రేపు ఉటంకిస్తాను. ముఖ్యం గా పై ఐదు పాయింట్లకీ సంబంధించినది.

ఇట్లు

యోగా.

PS:- “కవితా ఓ కవితా” ని ఇక్కడ ఉటంకించాను. ఐతే వెండీ యొక్క చర్చ జరుగుతున్న ఈ సందర్భం లో, నాకో భయం ఉంది.

వెండీ గానీ ఇది చూసి, “ఆరు కోట్ల తెలంగానాధ్రులకి “కవితా ఓ  కవితా” అని ఆరాధించే ఒక కవిత ఉందా? ఇది ఇన్నాళ్ళూ నేను psycho analyse చెయ్యలేదేమిటబ్బా”, అని వెంటనే పూనుకుని, వేల్చేరు గారికి ఫొన్ చేసేసి, “SriSri’s kavita o kavita epic poem – divine beauty or sexual perversion” అని ఒక phD మొదలెట్టేసి, ఆ తరువాత ఏదేదో ప్రచురించేసి, అప్పుడు నాలాటి వాడెవడో కేసు వేస్తే ఆ పైన ప్రత్యామ్నాయ ప్రబుధ్ధులందరూ దాన్ని నా లాటి చాందసుల వల్ల వాక్స్వేఛ్చ లోపిస్తోందని, పేజీలు పేజీలు వ్యాసాలు రాసేసి…అమ్మో ఈ పరిస్థిథి రాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తూ…ఇక సెలవా మరి. మళ్ళీ రేపు కలుద్దాం.

From → Uncategorized

Leave a Comment

Leave a comment